Friday, January 3, 2025

IPL 2024: ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో విజయం నమోదు చేసింది. మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ రెండు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (21), అభిషేక్ శర్మ (16)లు శుభారంభం అందించలేక పోయారు. అయితే యువ ఆటగాడు నితీష్ రెడ్డి అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. ధాటిగా ఆడిన నితీష్ రెడ్డి 5 సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 64 పరుగులు చేశాడు.

మిగతా వారిలో సమద్ (25), షాబాబ్ (14) పరుగులు సాధించారు. తర్వాత లక్షఛేదనకు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. శశాంక్ సింగ్ 25 బంతుల్లోనే అజేయంగా 46 పరుగులు చేశాడు. అశుతోస్ శర్మ 15 బంతుల్లోనే 33 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచి పంజాబ్‌ను దాదాపు గెలిపించినంత పని చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News