Sunday, January 19, 2025

ఐపిఎల్‌పై లోక్‌సభ ఎన్నికల ఎఫెక్ట్!

- Advertisement -
- Advertisement -

ముంబై: వచ్చే ఏడాది జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టోర్నమెంట్‌పై లోక్‌సభ ఎన్నికల ప్రభావం పడనుంది. 2024లో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపిఎల్ షెడ్యూల్‌ను ప్రకటించడంలో బిసిసిఐ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే ఐపిఎల్ షెడ్యూల్‌ను ఖరారు చేయాలని బిసిసిఐ భావిస్తోంది. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.

మరోవైపు ఐపిఎల్‌ను ప్రతి ఏడాది ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి ఎన్నికల కారణంగా ఐపిఎల్‌ను షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం బిసిసిఐకి ఇబ్బందిగా మారింది. ఎన్నికల సమయంలో ఐపిఎల్ మ్యాచ్‌లకు భద్రతా కల్పించే పరిస్థితి ఉండదు. దీంతో షెడ్యూల్‌ను ప్రకటించేందుకు ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వెనుకాడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News