Sunday, December 22, 2024

ఐపిఎల్ లో రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ

- Advertisement -
- Advertisement -

ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే రెండు సీజన్లలో 700 పైగా స్కోర్లు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్ గా కోహ్లీ నిలిచాడు.  విరాట్ కంటే ముందు క్రిస్‌ గేల్ ఈ ఫీట్ సాధించాడు. గేల్‌.. 2012లో 733, 2013లో 708 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. కీటీ, అ సీజన్ లో ఇప్పటివరకు అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడు కూడా కోహ్లీ(38)నే. ప్రస్తుతం 708 పరుగులతో ఐపిఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరుతో తొలి స్థానంలో నిలచాడు కోహ్లీ.

కోహ్లీ అద్భుత ఫామ్ తో చెలరేగిపోతున్నాడు. ఈ క్రమంలో వరుసగా ఆరు మ్యాచ్ లో గెలిచి ప్లేఆఫ్ కు చేరుకుంది బెంగళూరు జట్టు. శనివారం చిన్నస్వామి స్టేడియంలో చెన్నైతో జరిగిన మ్యాచ్‌‌లో బెంగళూరు 27  రన్స్ తేడాతో గెలిచి ప్లేఆఫ్ కు అర్హత సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌‌‌‌సీబీ 20 ఓవర్లలో 218/5 స్కోరు చేసింది. కెప్టెన్ డుప్లెసిస్ (54), విరాట్ కోహ్లీ (47), రజత్ పటీదార్‌‌‌‌ (41), కామెరూన్ గ్రీన్ (38 నాటౌట్‌‌) మెరుపులు మెరిపించారు. అనంతరం లక్ష్య ఛేదన దిగిన చెన్నై.. ప్లేఆఫ్స్‌‌ చేరేందుకు 201 రన్స్‌‌ చేయాల్సిన ఉండగా.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. రచిన్ రవీంద్ర (61), రవీంద్ర జడేజా (42 నాటౌట్‌‌), ధోనీ (25) పోరాడినా ఫలితం లేకపోయింది. అయితే  లక్నో, ఢిల్లీతో పాటు చెన్నై, బెంగళూరు జట్లు 14 పాయింట్లతో నిలిచినా.. మెరుగైన రన్‌‌రేట్‌‌ (0.459)తో ఆర్‌‌‌‌సీబీ ప్లేఆఫ్ కు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News