Monday, December 23, 2024

IPL 2024: ఐపిఎల్ లో చరిత్ర సృష్టించిన కోహ్లీ

- Advertisement -
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)లో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపిఎల్ చరిత్రలో ఒక జట్టు తరుపున అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఆదివారం ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో రెండు సిక్సులు బాది నయా రికార్డు సృష్టించాడు. కోహ్లీ. ఆర్సీబి తరుపున మొత్తం 250 సిక్సులు కొట్టిన కోహ్లీ.. ఐపిఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ప్లేయర్ గా నిలిచాడు.

కోహ్లీ తర్వాత క్రిస్ గేల్(బెంగళూరు తరుపున 239 సిక్సులు), ఎబి డివిలియ‌ర్స్ (బెంగళూరు తరుపున 238 సిక్సులు), రోహిత్ శ‌ర్మ(ముంబై తరుపున 223 సిక్సులు), కీర‌న్ పొలార్డ్(ముంబై తరుపున 223 సిక్సులు) ఉన్నారు. కాగా, ఐపిఎల్ లో ఇప్పటివరకు అత్యధిక సిక్సులు కొట్టిన ఇండియన్ ప్లేయర్ గా రోహిత్(275 సిక్సులు), తర్వాత కోహ్లీ ఉన్నాడు. ఓవరాల్ గా 357 సిక్సులతో క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News