Thursday, March 20, 2025

హోరాహోరీ ఖాయం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్18కి శనివారం తెరలేవనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ కోసం ఐపిఎల్‌కు చెం దిన 10 జట్లు సర్వం ఒడ్డేందుకు సిద్ధమయ్యాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌తో ఐపిఎల్ 2025కి తెరలేస్తోం ది. ఈ టోర్నమెంట్ కోసం ఇప్పటికే అన్ని జట్లు కఠోర సాధనలో నిమగ్నమయ్యాయి. పది జట్లకు సంబంధించిన కెప్టెన్లు కూడా ఖరారయ్యారు. సన్‌రైజ ర్స్ హైదరాబాద్‌కు పాట్ కమిన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు రుతురాజ్ గైక్వాడ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రజత్ పటిదార్, ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్య, కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అజింక్య రహానె, పంజాబ్ కింగ్స్‌కు శ్రే యస్ అయ్యర్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు అక్షర్ పటేల్, గుజరాత్ టైటాన్స్‌కు శుభ్‌మ న్ గిల్, లక్నో సూపర్ జెయింట్స్‌కు రిషబ్ పంత్, రాజస్థాన్ రాయల్స్‌కు సంజు శాంసన్‌లు సారథ్యం వహిస్తున్నారు. కోల్‌కతా, ఢిల్లీ, పంజాబ్, లక్నో, బెంగళూరు జట్లు కొత్త కెప్టెన్ల సారథ్యంలో బరిలోకి దిగుతున్నాయి. అన్ని జట్లలో నూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు.

స్వదేశీ, విదేశీ క్రికెటర్లతో ప్రతి జట్టు చాలా బలోపేతంగా కనిపిస్తోంది. గతంతో పోల్చితే ఈసారి ఐపిఎల్‌లో పోటీ తీవ్రంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు రెండు నెలల పాటు కొనసాగనున్న మెగా టోర్నమెంట్ అభిమానులను కనువిందు చేయనుంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, అజింక్య రహానె, మహేంద్ర సింగ్ ధోనీ, ఆండ్రీ రసెల్, కమిన్స్, మాక్స్‌వెల్, డుప్లెసిస్, బట్లర్, షమి, సిరా జ్, జడేజా, సూర్యకుమార్, శుభ్‌మన్, సంజు శాంసన్, శ్రేయస్, రిషబ్ పంత్, రుతురాజ్, పటిదార్, జంపా, రషీద్ ఖాన్, తదితరులు ఈ టోర్నమెంట్ కు ప్ర త్యేక ఆకర్షణగా మారారు. తమ తమ జట్లకు వీరు కీలక ఆటగాళ్లుగా ఉ న్నా రు. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత వీరిపై నెలకొంది. అన్ని జట్లలోనూ స్టార్ ఆటగాళ్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News