- Advertisement -
రానున్న ఐపిఎల్‌లో అన్ని జట్లకు గెలుపు అవకాశాలు సమంగా ఉన్నాయని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసేర్ హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. ప్రతి జట్టులోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదన్నాడు. ప్రతి ఆటగాడు సర్వం ఒడ్డేందుకు సిద్ధంగా ఉన్నాడు.దీంతో టోర్నమెంట్‌లోని ప్రతి మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయమన్నాడు. విరాట్ కోహ్లి, రిషబ్, శ్రేయస్, శాంసన్, ఇషాన్ కిషన్ తదితరులు ఈ టోర్నమెంట్‌లో పరుగుల వరద పారించడం తథ్యమన్నాడు. ఇక రోహిత్ శర్మ ముంబైటీమ్‌లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నాడు. అన్ని జట్లు కూడా ట్రోఫీపై కన్నేశాయని, దీంతో పోరు ఆసక్తికరంగా సాగే ఛాన్స్ ఉందని తెలిపాడు.
- Advertisement -