ఐపిఎల్ వేలంలో కాసుల పంట
రికార్డు స్థాయిలో ధర పలికిన
ఆటగాళ్లు ఊహించని రీతిలో
పలువురిపై భారీ మొత్తాలను
వెచ్చించిన ఫ్రాంచైజీలు
కెఎల్ రాహుల్, స్టార్క్‌కు
ఈసారి నిరాశే
ఐపిఎల్2025 వేలంలో కాసుల వరద పారింది. స్టార్ బ్యాట్స్‌మన్లు రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ రికార్డు స్థాయిలో ధర పలికారు. జెడ్డా కేంద్రంగా సాగిన వేలం ప్రక్రి యలో రూ.27కోట్లకు రిషబ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. శ్రేయాస్ అయ్యర్‌ను రూ.26.75కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసుకుంది. వెంకటేష్ అయ్యర్‌ను రూ.23.75 కోట్లకు
కోల్‌కతా సొంతం చేసుకుంది. ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్, స్పిన్నర్ యజువేంద్ర చాహల్ వేలంలో సత్తా చాటారు. రూ.18కోట్లకు అర్ష్‌దీప్‌ను పంజాబ్ దక్కించుకోగా..చాహల్‌ను కూడా అంతే ధరకు కొనుగోలు చేసు కుంది. ఈ సారి వేలంలో అత్యంత నిరాశ ఎదురైంది కెఎల్ రాహుల్‌కే. అంచనాలను తారుమారు చేస్తూ రూ.14కోట్లకే ఢిల్లీ అతడ్ని సొంతం చేసుకుంది. ఈసారి రాహుల్‌కు రూ.25కోట్ల వరకు పలకవచ్చునని ఊహాగానాలు వెల్లువెత్తాయి. గత ఏడాది వేలంలో రూ.27కోట్లు పలికిన మిచెల్ స్టార్క్‌ను ఈ సారి ఢిల్లీ రూ.11.75కోట్లకే దక్కించుకో వడం విశేషం. హైదరాబాద్‌కు చెందిన స్టార్ బౌలర్ సిరాజ్‌ను రూ.12.25 కోట్లకు గుజరాత్ సొంత చేసుకుంది. షమీని సన్‌రైజర్స్ రూ.10కోట్లకు దక్కించుకుంది.
ఐపిఎల్ వేలంలో భారత యువ ఆటగాడు రిషభ్ పంత్‌పై కాసుల వర్షం కురిసింది. అతను ఐపిఎల్ చరిత్రలోనే అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా నిలిచాడు. లఖ్ నవూ ఏకంగా రూ.27 కోట్లకు సొంతం చేసుకుంది. పంత్ కోసం లఖ్ నవూ, బెంగళూరు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు లఖ్‌నవూ రికార్డు ధరకు అతడిని దక్కించుకుంది. టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా భారీ ధర పలికాడు. శ్రేయస్‌ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక వెంకటేశ్ అయ్యర్‌ను రూ.23.75 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కైవసం చేసుకుంది. టీమిండియా పేసర్ అర్షదీప్ సింగ్‌కు పంజాబ్ భారీగా వెచ్చించింది. రూ.18 కోట్లకు అతన్ని దక్కించుకుంది. ఇక కనీస ధర రూ. 2 కోట్లు ఉన్న సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడను రూ.10.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకోగా, కనీస ధర రూ. 2 కోట్లు ఉన్న ఇంగ్లాండ్ బ్యాటర్ జోస్ బట్లర్‌ను రూ.15.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.
భారీ ధర పలికిన క్రికెటర్లు వీరే..
లక్నో సూపర్ జెయింట్స్
రిషభ్ పంత్ : రూ. 27 కోట్లు
డేవిడ్ మిల్లర్: రూ.7.5 కోట్లు
మిచెల్ మార్ష్: రూ.3.40 కోట్లు
మార్‌క్రమ్: రూ.2 కోట్లు
నికోలన్ పూరన్: రూ.21 కోట్లు
పంజాబ్ కింగ్స్
శ్రేయస్: రూ.26.75 కోట్లు
అర్ష్‌దీప్ సింగ్: రూ.18 కోట్లు
చాహల్: రూ.18 కోట్లు
మార్కస్ స్టాయినిస్:- రూ.11 కోట్లు
మ్యాక్స్‌వెల్: రూ.4.20 కోట్లు
గుజరాత్ టైటాన్స్
జోస్ బట్లర్: రూ.15.75 కోట్లు
సిరాజ్: రూ.12.25 కోట్లు
కగిసో రబాడ: – రూ.10.75 కోట్లు
కగిసో రబాడ: రూ.10.75 కోట్లు
జోస్ బట్లర్: రూ.15.75 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్
కేఎల్ రాహుల్: రూ.14 కోట్లు
మిచెల్ స్టార్క్: రూ.11.75 కోట్లు
జేక్ ఫ్రేజర్: రూ.9 కోట్లు
హ్యారీ బ్రూక్: రూ.6.25 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్
మహ్మద్ షమి: రూ.10 కోట్లు
హర్షల్ పటేల్: రూ.8కోట్లు
హెన్రిచ్ క్లాసెన్: రూ.23 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్
ఆర్.అశ్విన్: రూ.9.75 కోట్లు
డేవాన్ కాన్వే: రూ.6.25 కోట్లు
రచిన్ రవీంద్రన్: రూ.4 కోట్లు
రాహుల్ త్రిపాఠి: రూ.3.40 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
విరాట్ కోహ్లీ: రూ.21 కోట్లు
లివింగ్‌స్టోన్: రూ.8.75 కోట్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్
క్వింటన్ డికాక్: రూ.3.60 కోట్లు