- Advertisement -
ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం క్రికెట్ అభిమానులకు డబుల్ ఎంటర్ టైన్మెంట్ లభించనుంది. ఐపిఎల్ లో ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ కాపిటల్స్ జట్లు తలపడనున్నాయి.ఇందులో ఢిల్లీ ఆడిన రెండు మ్యాచ్ లో గెలిచి జోరు మీదుండగా.. చెన్నై మాత్రం ఈసారి అంచనాలకు తగ్గట్లు ఆడటంలేదు. ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఒకటి మాత్రమే గెలిచి.. మిగతా రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. ఇవాళ హోం గ్రౌండ్ లో జరిగే మ్యాచ్ గెలిచి మళ్లీ రేసులోకి రావాలని పట్టుదలగా ఉంది చెన్నై.
ఇక రాత్రి 7.30 గంటలకు పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ ఢీకొననున్నాయి. వరుస విజయాలతో పంజాబ్ జోరు మీద ఉండగా, వరుస ఓటములతో రాజస్థాన్ డీలా పడింది. ఈ మ్యాచ్ లోనైనా విజయం సాధించి సత్తా చాటాలని భావిస్తోంది.
- Advertisement -