Sunday, April 20, 2025

డబుల్ ధమాకా.. ఇవాళ ఐపిఎల్ లో 2 మ్యాచ్‌లు

- Advertisement -
- Advertisement -

వీకెండ్ వేళ క్రికెట్ అభిమానులకు శనివారం డబుల్ ధమాకా లభించనుంది. ఇవాళ ఐపిఎల్ లో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 3.30కు గుజరాత్ టైటాన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనుంది. ఢిల్లీ జట్టు ఆడిన 6 మ్యాచ్ ల్లో 5 గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక, గుజరాత్ 6 మ్యాచ్ ల్లో 4 గెలిచి మూడో స్థానంలో ఉంది. ఇప్పటివరకూ ఇరుజట్ల మధ్య 5 మ్యాచులు జరగ్గా.. ఢిల్లీ మూడు, గుజరాత్ రెండు సార్లు గెలిచాయి. దీంతో ఇవాళ్టీ మ్యాచ్ రసవత్తరంగా సాగే చాన్స్ ఉంది.

ఇక, రాత్రి 7.30కు జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ గెయింట్స్ జట్లు పోరుకు బరిలోకి దిగనున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఐదుసార్లు తలపడితే నాలుగుసార్లు గెలిచి రాజస్థాన్‌ పైచేయి సాధించింది. కాగా, రాజస్థాన్ జట్టు 7వ స్థానంలో ఉండగా.. లక్నో 5వ స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి తమ స్థానాలను మెరుగు పర్చుకోవాలని పట్టుదలగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News