- Advertisement -
ఐపిఎల్ 2025లో భాగంగా ఇవాళ లక్నో సూపర్ గెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు లక్నో వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకుని.. లక్నో జట్టును ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.ఈ సీజన్ లో వరుస విజయాలతో జోరుమీదున్న ఢిల్లీ.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈమ్యచ్ లో గెలుపొంది తమ స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది. మరోవైపు, పడుతూ..లేస్తూ తన ప్రయాణం కొసాగిస్తోంది లక్నో జట్టు. ప్రస్తుతం 5వ స్థానంలో ఉన్న లక్నో.. ఢిల్లీపై విజయం సాధించి సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.
- Advertisement -