- Advertisement -
ఐపిఎల్ 2025లో భాగంగా జరగనున్న లీగ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో జోరుమీదున్న గుజరాత్ ను సొంత గడ్డపై రాజస్థాన్ కు ఓడించడం అంతా సులువు కాదు.
గుజరాత్.. ఆడిన నాలుగింట్లో మూడు మ్యాచ్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ పై గెలిచి మరింత మెరుగైన స్థానానికి చేరుకోవాలని గుజరాత్ భావిస్తోంది. మరోవైపు, ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో రెండు మాత్రమే గెలిచి ఏడో స్థానంలో కొనసాగుతోంది రాజస్థాన్ జట్టు. దీంతో గుజరాత్ పై తప్పకుండా గెలుపొందాలని పట్టుదలగా ఉంది.
- Advertisement -