Monday, April 28, 2025

నేడు గుజరాత్-రాజస్థాన్ మధ్య కీలక పోరు.. ఓడితే ఇంటికే

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 2025లో సోమవారం మరో కీలక సమరం జరగనుంది. ఇవాళ గుజరాత్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్ రాజస్థాన్ కు కీలకంగా మారింది. ఇప్పటికే ఆడిన తొమ్మిది మ్యాచ్ ల్లో రాజస్థాన్ జట్టు కేవలం రెండు మాత్రమే గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో తొమ్మిందో స్థానానికి పడిపోయింది. ఇవాళ గుజరాత్ జట్టుతో జరిగే మ్యాచ్ లోనూ ఓడిపోతే రాజస్థాన్ ఇంటికి వెళ్లిపోవాల్సిందే.  ఈ క్రమంలో రాజస్థాన్ చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమైంది.

మరోవైపు, గుజరాత్ జట్టు వరుస విజయాలతో అంచనాలకు మించి రాణిస్తుంది. బౌలింగ్, బ్యాటింగ్ లో బలంగా కనిపిస్తున్న గుజరాత్.. ఎనిమిది మ్యాచ్ ల్లో 6 గెలిచి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో గెలిచి తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News