- Advertisement -
ఐపిఎల్ 2025లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు సాధించింది. రఘువంశి(50), వెంకటేశ్ అయ్యర్(60)లు అర్థ శతకాలతో మెరుపులు మెరిపించారు. వీరితోపాటు కెప్టెన్ రహానె(38), రింకు సింగ్(32 నాటౌట్)లు కూడా చెలరేగారు. దీంతో కోల్ కతా, సన్ రైజర్స్ కు 201 పరుగుల భారీ టార్గెట్ ను విధించింది.
- Advertisement -