- Advertisement -
ఢిల్లీ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా జట్టు భారీ స్కోరు చేసింది. ఐపిఎల్ 2025 లీగ్ దశలో భాగంగా జరుగుతున్న ఈ పోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు సాధించింది,.ఓపెనర్లు గుర్బాజ్ (26) సునీల్ నరైన్ (27)లు శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన అజింక్యా రహానె(26), రఘువంశీ (44), ఆండ్రీ రస్సెల్ (17), రింకు సింగ్ (36)లు వేగంగా పరుగులు రాబట్టారు. దీంతో ఢిల్లీకి 205 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఢిల్లీ బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, నిగమ్ లు చెరో రెండు వికెట్లు తీశారు.
- Advertisement -