- Advertisement -
KKR vs LSG: ఐపిఎల్ 2025లో భాగంగా జరుగుతున్న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుపై లఖ్‌నవూ సూపర్ గెయింట్స్ బ్యాట్స్ మెన్లు మెరుపులు మెరిపించారు. ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన 238 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(81), నికోలస్ పూరన్(87) భారీ అర్ధ శతకాలతో మెరుపులు మెరిపించారు. ఐడెన్ మార్కమ్(47) కూడా రాణించాడు. దీంతో లక్నో, కోల్ కతాకు 239 పరుగుల భారీ టార్గెట్ విధించింది.
- Advertisement -