- Advertisement -
ఐపిఎల్ 2025లో భాగంగా జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకు లక్నో 172 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన లక్నోకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మార్ష్ డకౌట్ గా వెనుదిరిగగా..మరో ఓపెనర్ మార్‌క్రమ్ (28; 18 బంతుల్లో) ధనాధన్ బ్యాటింగ్ చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్(2), డేవిడ్ మిల్లర్()లు నిరాశపర్చారు.
ఈ క్రమంలో మరోసారి నికోలస్ పూరన్(44) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు.పూరన్ తోపాటు ఆయూష్ బదోని(41) కీలక పరుగులు చేశాడు. ఇక, చివర్లో సమద్(27) మెరుపులు మెరిపించడంతో లక్నో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
- Advertisement -