Tuesday, April 15, 2025

ఐపిఎలో చరిత్ర సృష్టించిన ముంబయి..

- Advertisement -
- Advertisement -

ఐపిఎలో ముంబయి ఇండియన్స్ జట్టు చరిత్ర సృష్టించింది. నిన్న రాత్రి ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించడంతో ముంబయి జట్టు ఓ అరుదైన రికార్డు నెలకొల్పింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 200కు పైగా స్కోర్‌ చేసిన ప్రతిసారీ గెలిచిన తొలి జట్టుగా ముంబై నిలిచింది. ఇప్పటి వరకు వరుసగా 15 మ్యాచుల్లో ఇలా గెలిచిన ముంబై.. ఈ అరుదైన ఘనతను సాధించింది. ఇక, 200కు పైగా స్కోర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 21 సార్లు డిఫెండ్ చేసుకోగా ఐదుసార్లు ఓడిపోయింది. ఆ తర్వాత ఆర్సీబీ 19 సార్లు గెలిచి, ఐదుసార్లు ఓడగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా 15 సార్లు గెలుపొంది, రెండు సార్లు ఓడిపోయింది.

కాగా మ్యాచ్ విషయానికి వస్తే.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంబై బౌలర్లు 193 పరుగులకే కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కరుణ్ నాయర్(89), అభిషేక్ పోరెల్(33)లు తప్ప మరెవరూ రాణించకపోవడంతో ఢిల్లీ తొలి ఓటమిని మూటగట్టుకుంది. ముంబై బౌలర్లలో కర్ణ్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా.. సాట్నర్ రెండు, బుమ్రా, దీపక్ చాహార్‌లు చెరో వికెట్ దక్కించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News