Monday, April 14, 2025

ఐపిఎల్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా..

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ అభిమానులకు ఆదివారం డబుల్ ధమాకా లభించనుంది.. ఇవాళ రెండు కీలక మ్యాచ్ లు జరగనున్నాయి.రాజస్థాన్ రాయల్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు జైపూర్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు తలపడనున్నాయి. చెరో 5 మ్యాచ్ లు ఆడిన ఇరుజట్లలో.. మూడు మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో బెంగళూరు ఉండగా.. కేవలం 2 మ్యాచ్ ల్లోనే గెలుపొందిన రాజస్థాన్ 7వ స్థానంలో కొనసాగుతోంది. సొంత మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో విజయం సాధించి మళ్లీ రేసులోకి రావాలని రాజస్థాన్ జట్టు పట్టుదలగా ఉంది. మరోవైపు, రాజస్థాన్ ను ఓడించి సత్తా చాటాలని బెంగళూరు భావిస్తోంది.

ఇక, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండయన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఢీకొననున్నాయి. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీని ఓడించడం ముంబైకి కష్టమనే చెప్పాలి. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముంబైకి ఈ మ్యాచ్ కీలకం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News