Sunday, April 27, 2025

ఇవాళ ఐపిఎల్ లో డబుల్ ధమాకా.. రెండు హై వోల్టేజ్ మ్యాచ్ లు

- Advertisement -
- Advertisement -

క్రికెట్ అభిమానులకు ఆదివారం ఐపిఎల్ లో డబుల్ మజాకా లభించనుంది. ఈరోజు రెండు హై వోల్టేజ్ మ్యాచ్ లు జరగనున్నాయి. ప్లేఆఫ్ రేసులో మరింత స్ట్రాంగ్ గా నిలిచేందుకు ఇవాళ నాలుగు జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 3.30గంటలకు ముంబై ఇండియన్స్ జట్టు తన సొంత గడ్డపై లక్నో సూపర్ గెయింట్స్ ఢీకొనబోతోంది. ప్రారంభంలో తేలిపోయిన ముంబై అనూహ్యంగా పుంజుకుని రేసులోకి దూసుకొచ్చింది. బుమ్రా తిరిగి రావడం, ఓపెనర్ రోహిత్ ఫామ్ లోకి రావడంతో ముంబై.. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో దుర్భేద్యంగా తయారైంది. దీంతో వరుస మ్యాచ్ ల్లో గెలుస్తూ సత్త చాటుతోంది. పడుతూ.. లేస్తూ వస్తున్న లక్నోకు ముంబైని ఎదుర్కోవడం కష్టమనే చెప్పాలి.

ఇక, ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు ఢిల్లీ వేదికగా ఆర్సీబితో ఢిల్లీ జట్టు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఈ రెండు బలమైన జట్లు కావడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయం. ఈ మ్యాచ్ లో గెలిచి తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News