ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఇవాళ రాత్రి 7.30 గంటలకు వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.ఇక, ముంబై జట్టు వరుస ఓటములతో సతమతమవుతోంది ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాల్ లో ఒకటి మాత్రమే గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో ముంబై జట్టు ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు వరుస విజయాలతో ఆర్సీబీ జోరుమీదుంది. ఆడిన మూడు మ్యాచ్ లో ఒకటి ఓడి.. రెండు మ్యాచ్ ల్లో గెలుపొందింది. ఈ క్రమంలో పటిష్ట ఆర్సీబీని ఎదుర్కోవడం ముంబైకి కష్టమే.
అయితే, ముంబై స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులో చేరినట్లు తెలుస్తోంది. గాయం కారణంగా బుమ్రా విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అతని రాకతో ఆ జట్టు బౌలింగ్ బలంగా మారడం ఖాయం. దాంతో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్ లో బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీతో జరగనున్న ఈ మ్యాచ్ లో తప్పకుండా విజయం సాధించాలని ముంబై పట్టుదలగా ఉంది. మరోవైపు, ఆర్సీబీ కూడా ముంబైని ఓడించి తమ సత్తా చాటాలని భావిస్తోంది.