Wednesday, April 16, 2025

చెన్నైతో మ్యాచ్.. 5 కీలక వికెట్లు కోల్పోయిన పంజాబ్

- Advertisement -
- Advertisement -

PBKS vs CSK: ఐపిఎల్ 2025లో భాగంగా ములాన్ పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పంజాబ్ కు ఆదిలోనే చెన్నై షాకిచ్చింది. రెండో ఓవర్ లోనే ముకేశ్‌ చౌదరి బౌలింగ్ లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ డకౌటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (9), స్టాయినిస్ (4)లు నిరాపర్చారు.

మరో ఎండ్ లో దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ ప్రియాంశ్‌ ఆర్య కేవలం 19 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు. ధనాధన్ ఇన్నింగ్స్ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. అయితే, మరో ఎండ్ లో వచ్చిన వారు వచ్చినట్లే పెవిలియన్ చేరుతున్నారు. దీంతో పంజాబ్ 9 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో ప్రియాంశ్‌ ఆర్య (59), శశాంక్ సింగ్(1)లు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News