Monday, January 20, 2025

IPL 2025 Auction: మెగా వేలం బరిలో 574 మంది క్రికెటర్లు

- Advertisement -
- Advertisement -

ముంబై: సౌదీ అరేబియాలోని జెడ్డా నగరం వేదికగా జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మెగా వేలం పాటలో పాల్గొనే క్రికెటర్ల జాబితాను బిసిసిఐ ప్రకటించింది. నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డాలో ఈ వేలం పాట జరుగనుంది. కాగా, వేలం పాట కోసం 1,574 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో నుంచి 574 మందిని షార్ట్‌లిస్ట్ చేశారు. వీరిలో భారత్‌కు చెందిన 48, విదేశాలకు చెందిన 193 క్యాప్‌డ్ క్రికెటర్లు ఉన్నారు.

అంతేగాక భారత్‌కు చెందిన 318 మంది, విదేశాలకు చెందిన 12 మంది అన్ క్యాప్‌డ్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. అసోసియేట్ దేశాలకు చెందిన ముగ్గురు క్రికెటర్లు కూడా వేలం బరిలో నిలువనున్నారు. కాగా కనీస ధర రూ.2 కోట్లు కలిగిన 81 మంది, బేస్ ధర రూ.1.50 కోట్లు ఉన్న 27 మంది బరిలో ఉన్నారు. కాగా, 320 మంది క్రికెటర్లు రూ.30 లక్షలతో వేలం బరిలో నిలిచారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News