Wednesday, April 16, 2025

కోల్ కతాతో మ్యాచ్.. బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 2025లో భాగంగా మరికొద్దిసేపట్లో కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి. ములాన్ పూర్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు పంజాబ్ 5 మ్యాచ్ ల్లో 3 మూడు గెలిచి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది. ఇక, కోల్ కతా 6 మ్యాచ్ ల్లో 3 మూడు గెలిచి నెట్ రన్ రేట్ కారణంగా 5వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో గెలుపొంది తమ స్థానాలను మెరుగు పర్చుకోవాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News