- Advertisement -
ఐపీఎల్ 2025లో గురువారం మరో రసవత్తర సమరం జరగనుంది. ఇవాళ బెంగళూరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో బలంగా ఉన్న ఇరుజట్లు పోరుకు సిద్ధమవుతుండటంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్ ల్లో గెలుపొంది జోరుమీదున్న ఢిల్లీ పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది.
మరోవైపు, ఆర్సీబీ.. నాలుగు మ్యాచ్ లు ఆడి మూడింట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచి అగ్రస్థానానికి చేరుకోవాలని భావిస్తుందడగా.. ఢిల్లీని ఓడించి తమ స్థానాన్ని మరింత మెరుగు పర్చుకోవాలని ఆర్సీబీ పట్టుదలగా ఉంది.
- Advertisement -