క్రికెట్ అభిమానులకు ఇండియాన్ ప్రీమియర్ లీగ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపిఎల్ సీజన్ మొదలవుతుంది అంటే చాలు.. మ్యాచ్ వచ్చే సమయానికి టివిలకు అతుక్కుపోతారు. ప్రాణ మిత్రులైనా సరే.. తమ అభిమాన జట్లను సపోర్ట్ చేసే విషయం మాత్రం పోట్లాడుకుంటారు. అలాంటి అభిమానులందరి బీసీసీఐ గుడ్‌న్యూస్ అందించింది. ఐపిఎల్-2025 షెడ్యూల్‌ని ఆదివారం విడదల చేసింది.
ఈ ఏడాది ఐపిఎల్ మొత్తం 65 రోజుల పాటు జరుగనుంది. 13 వేదికల్లో మొత్తం 74 మ్యాచ్‌లు ఆడనున్నారు. మార్చి 22వ తేదీన కోల్‌కత్తా వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో ఆర్సిబి కెకెఆర్ తలపడనున్నాయి. ఇక మార్చి 23వ తేదీన ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. అదే రోజున ముంబై వేదికగా ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్‌కింగ్స్ తలపడనున్నాయి. కాగా, ఈ టోర్నీ ప్లేఆఫ్‌లు హైదరాబాద్ మరియు కోల్‌కతా వేదికగా జరుగుతాయి. మే 20న మొదటి క్వాలిఫయర్, 21న ఎలిమినేటర్, 23న రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరుగగా.. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ మే 25న జరుగనుంది.