- Advertisement -
ఐపిఎల్ 2025లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా ఇరుజట్లు మధ్య మరికాసేపట్లో రసవత్తర పోరు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కాగా, ఇరుజట్లు ఇప్పటివరకు మూడేసి మ్యాచ్ లు ఆడాయి. రెండు టీమ్స్ ఒక్కో విజయాన్ని మాత్రమే నమోదు చేశాయి. ఈ మ్యాచ్ లో గెలిచి మళ్లీ పుంజుకోవాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇక, పాయింట్ల పట్టికలో ఎస్ఆర్ హెచ్ 8వ స్థానంలో ఉండగా.. కెకెఆర్ 10వ స్థానంలో ఉంది.
- Advertisement -