Saturday, April 19, 2025

చేతులెత్తేసిన ఎస్ఆర్ హెచ్ బ్యాట్స్ మెన్స్.. ముంబైకి స్వల్ప టార్గెట్

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 2025లో భాగంగా ముంబయి ఇండియన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్ మెన్లు లేతులెత్తేశారు.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్.. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి ఆచి తూచి ఆడింది. ముంబై బౌలర్లు కట్టదిట్టమైన బంతులతో చెలరేగడంతో పరుగులు చేసేందుకు శ్రమించాల్సి వచ్చింది. ఓపెనర్ అభషేక్ శర్మ(40), క్లాసెన్(37).. చివర్లలో అనికేత్ వర్మ( అజేయంగా 8 బంతుల్లో 18 పరుగులు)లు రాణించారు. పిచ్ బౌలింగ్ కు అనుకూలిస్తుండటంతో మిగతా బ్యాట్స్ మెన్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. దీంతో 20 ఓవర్లలో సన్ రైజర్స్ 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, బౌల్ట్, పాండ్యాలు తలో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News