- Advertisement -
ఐపిఎల్ 2025లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు బిగ్ షాక్ తగిలింది. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్ హెచ్.. వెంట వెంటనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ హెడ్(4) ఔట్ కాగా.. ఆ తర్వాత ఓవర్లో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(2) స్లిప్ లో దొరికిపోయాడు.ఇక మూడో ఓవర్ లో ఇషన్ కిషన్(2) కూడా పెవిలియన్ కు చేరాడు. దీంతో సన్ రైజర్స్ 3 ఓవర్లలో కేవలం 9 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో నితిశ్ కుమార్ రెడ్డి(1), కమింద్(4)లు ఉన్నారు.
- Advertisement -