Friday, December 27, 2024

వేలానికి వేళాయే!

- Advertisement -
- Advertisement -

నేడు ఐపిఎల్ మినీ ఆక్షన్

దుబాయ్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మినీ వేలానికి సర్వం సిద్దమైంది. దుబాయ్‌లోని కోకకోలా అరెనా వేదికగా మంగళవారం ఈ మెగా వేలం జరగనుంది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ వేలం ప్రారంభం కానుంది. మొత్తం 1166 మంది ప్లేయర్లు ఈ వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి కనబర్చగా.. 10 ఫ్రాంచైజీలు 333 మంది ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేశాయి.

వీరిలో 214 మంది భారత ఆటగాళ్లు, 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 10 ఫ్రాంచైజీల్లో కలిపి మొత్తం గరిష్టంగా 77 స్థానాలు ఖాళీగా ఉండగా.. ఇందులో 30 ఓవర్ సీస్ స్లాట్స్ ఉన్నాయి. మాక్ ఆక్షన్స్‌తో ప్రాక్టీస్ కూడా చేశాయి. నచ్చిన ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాగా, ఈ సారి వేలంలో ఆక్షనీర్‌గా మల్లికా సాగర్ వ్యవహరించనుంది. ఐపీఎల్ వేలంలో ఆక్షనీర్‌గా వ్యవహరించనున్న తొలి మహిళగా ఆమె రికార్డులకు ఎక్కారు. ఇప్పటికే ఆమె వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌కు సంబంధించిన వేలాన్ని సయితం నిర్వహించారు.

ఫ్రాంచైజీల మొత్తం డబ్బు..
గుజరాత్ టైటాన్స్ రూ.38.15 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్- రూ.31.4 కోట్లు
ఎస్‌ఆర్‌హెచ్ -రూ.34 కోట్లు
కేకేఆర్ -రూ.32.7 కోట్లు
పంజాబ్ కింగ్స్ -రూ.29.1 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ -రూ.28.95 కోట్లు
ఆర్‌సీబీ -రూ.23.25 కోట్లు
ముంబై ఇండియన్స్ -రూ.7.75 కోట్లు
రాజస్థాన్ రాయల్స్ -రూ.14.5 కోట్లు
ఎల్‌ఎస్‌జీ -రూ.13.5 కోట్లు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News