Wednesday, January 22, 2025

జెడ్డాలో ఐపిఎల్ వేలం పాట

- Advertisement -
- Advertisement -

మెగా వేలానికి 1574 మంది దరఖాస్తు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 2025 కోసం నవంబర్ 24, 25 తేదీల్లో మెగా వేలం పాట నిర్వహించనున్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో ఈ వేలం పాట జరుగనుంది. ఈ విషయాన్ని భా రత క్రికెట్ బోర్డు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. మెగా వేలం పాట కోసం ఇప్పటి వరకు 1574 మంది క్రికెటర్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో భారత్‌కు చెందిన 1165 మంది క్రికెటర్లు ఉన్నారు.

మిగతా 409 విదేశీ క్రికెటర్లు ఉన్నారు. సౌతాఫ్రికా నుంచి అత్యధికంగా 91 మంది దరఖాస్తు చేసుకున్నట్టు బిసిసిఐ వెల్లడించింది. ఇక ఆస్ట్రేలియాకు చెందిన 76 మంది క్రికెటర్లు వేలం పాటలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు. కాగా వచ్చే ఐపిఎల్ సీజన్ కోసం ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు రిటెన్షన్ ఆటగాళ్ల తుది జాబితాను ప్రకటించాయి. ఈసారి రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కృనాల్ పాండ్య, సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్ తదితరులు ఈసారి బరిలో ఉన్నారు. దీంతో పాటు పలువురు విదేశీ క్రికెటర్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News