Wednesday, January 22, 2025

ఐపిఎల్ వేలంలో రికార్డ్.. మిచెల్ స్టార్క్కు రూ.24.75 కోట్లు

- Advertisement -
- Advertisement -

ఐపీఎల్ మినీ వేలంలో అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. వన్డే ప్రపంచ కప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లకు వేలంలో భారీ ధర పలుకుతోంది. ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ ను 20 కోట్లకు సన్ రైజర్స్ సొంతం చేసుకుంటే, పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ను కోల్ కతా నైట్ రైడర్స్ ఏకంగా 24.75 కోట్లకు దక్కించుకుంది. రెండు కోట్లతో వేలంలో నిలిచిన స్టార్క్ కోసం గుజరాత్ టైటాన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. చివరకు కోల్ కతా నైట్ రైడర్స్ పైచేయి సాధించింది.

వెస్టిండీస్ ఆటగాడు అల్జారీ జోసెఫ్ ను 11.50 కోట్లు చెల్లించి రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. భారత పేసర్ ఉమేశ్ యాదవ్ ను 5.8 కోట్లతో గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేయగా, శివం మావిని లక్నో సూపర్ జెయింట్స్ 6.4 కోట్లతో దక్కించుకుంది. హైదరాబాద్ బ్యాటర్ కె.ఎస్. భరత్ ను 50 లక్షలకు కోల్ కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News