Thursday, January 23, 2025

ధూల్ కోసం క్యూ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/క్రీడా విభాగం : మరో 5 రోజుల్లో ఐపిఎల్ 2022 సీజన్‌కు వేలం జరగనుంది. ఈ మెగా వేలానికి భారత క్రికెట్ బోర్డు(బసిసిఐ) ఇప్పటికే సర్వం సిద్ధం చేసింది. పది ఫ్రాంచైజీలూ మెగా వేలంలో అనుసరించాల్సిన తమ వ్యూహాలను ముమ్మరం చేసుకున్నాయి. ఇటు తెలుగు వారి టీం అయినా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ వ్యూహాలతో అన్నింటికంటే పదునైన వ్యూహాలతో ఓ అడుగు ముందే ఉంది. గత సీజన్‌లో తీవ్రంగా నిరాశపరచడంతో ఈ సారి ఎలాగైనా సత్తా చాటాలని సైలెంట్‌గా ప్రణాళికలు రచిస్తోంది. మెగా వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లపై సన్‌రైజర్స్ హైదరాబాద్ మెనేజ్‌మెంట్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల అండర్19 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాపై సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ ప్రధానంగా దృష్టి సారించినట్టు సమాచారం. ఇటీవల భారత అండర్19 జట్టు ప్రపంచకప్ గెలవడంలో యష్ ధూల్ కెప్టెన్‌గా, ఆటగాడిగా కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు ముండు జరిగిన ఆసియా కప్ గెలవడంలోనూ యష్ ధూల్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా కీలక పాత్ర పోషించాడు. బ్యాటర్‌గా ప్రస్తుతం యష్ ధూల్ సూపర్ ఫాంలో ఉన్నాడు. ఆసియా కప్‌లో, ప్రపంచకప్‌లో భారీగా పరుగులు సాధించాడు. ప్రపంచకప్‌లో కరోనా బారిన పడినప్పటికీ కోలుకుని వచ్చి సత్తా చాటాడు. సెమీ ఫైనల్‌లో టీం కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చి ఆస్ట్రేలియాపై సూపర్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. దీంతో యష్ ధూల్ బ్యాటింగ్‌పై అందరికీ మంచి నమ్మకం ఏర్పడింది. అందుకే ధూల్ జట్టులో ఉంటే మంచి బ్యాటర్‌గా రాణిస్తాడని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ నమ్ముతుందని సమాచారం. జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కూడా బలపడుతుందని భావిస్తోందట. ఎందుకంటే గత సీజన్లో సన్‌రైజర్స్ టీం బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలైంది.
భారీ ధర తప్పదు..
యష్ ధూల్ కోసం వేలంలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి పోటీ ఉండనుంది. ఆ జట్లు కూడా వేలంలో ధూల్‌ను దక్కించుకోవాలని ప్రయత్నాల్లో ఉన్నాయని, ఇందుకోసం సన్‌రైజర్స్‌తో పాటు ముంబై, ఢిల్లీ కూడా ధూల్‌కు భారీ ధర చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. దీంతో మెగా వేలంలో యష్ ధూల్ కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఐపిఎల్ మెగా వేలంలో యష్ ధూల్ 20 లక్షల రూపాయల బేస్ ప్రైజ్‌తో ఉన్నాడు. కానీ అతనికి ఉన్న డిమాండ్ దృష్ట్యా వేలంలో ప్రాంచైజీల మధ్య పోటీ ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ధూల్ ధర అమాంతం పెరుగుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం. వారి అంచనా ప్రకారం వేలంలో ధూల్ 6 నుంచి 10 కోట్ల రూపాయల ధర పలుకుతాడని చెబుతున్నారు. ఇదే జరిగితే కేవలం 19 ఏళ్ల వయసులోనే యష్ ధూల్ కోటీశ్వరుడు అయిపోనున్నాడు. కాగా ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపిఎల్ మెగా వేలం జరగనున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News