Saturday, February 22, 2025

CSK vs GT: శుభ్ మన్ గిల్కు జరిమానా

- Advertisement -
- Advertisement -

గజరాత్ కెప్టెన్ శుభ్ మన్ గిల్కు షాకిచ్చారు ఐపిఎల్ మేనేజ్ మెంట్. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా గిల్ కు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు స్లో ఓవర్ రేటు నమోదు చేసింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ ప్రకారం.. గిల్‌కు జరిమానా విధించడం జరిగిందని ఐపిఎల్ అధికారిక ప్రకటనలో తెలిపింది.

చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టుపై సిఎస్ కె 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (46), రచిన్ రవీంద్ర (46) జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత శివమ్ దూబె 23 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లు, రెండు బౌండరీలతో 51 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News