Thursday, January 23, 2025

ఐపిఎల్‌కు ఏదీ సాటిరాదు..

- Advertisement -
- Advertisement -

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)కు ఈ లీగ్ కూడా సాటిరాదని భారత మాజీ క్రికెటర్, ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఐపిఎల్‌కు దీటుగా పాకిస్థాన్ సూపర్ లీగ్ ఉందని పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలను చోప్రా తప్పుపట్టాడు. ఐపిఎల్‌కు ఏ లీగ్ కూడా సరితూగదన్నాడు. ప్రపంచ క్రికెట్‌లోనే ఐపిఎల్ చాలా అత్యుత్తమమైన టోర్నీ అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. ఐపిఎల్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉందన్నాడు. అంతేగాక ఈ టోర్నీలో ఆడేందుకు భారత్‌తో పాటు విదేశీ క్రికెటర్లు సయితం ఎంతో ఆసక్తి కనబరుస్తారనే విషయాన్ని మరువకూడదన్నాడు. క్రికెటర్లు పేరుతో పాటు విపరీతమైన ఆదాయాన్ని సాధించి పెడుతున్న లీగ్ ఏదైనా ఉందంటే అది ఐపిఎల్ ఒక్కటేనని స్పష్టం చేశాడు. పాక్ సూపర్ లీగ్ ఏ విషయంలో ఐపిఎల్‌కు సాటిరాదని చోప్రా అభిప్రాయపడ్డాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News