Wednesday, December 25, 2024

ఐపిఎల్ మెగా వేలానికి సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

జెడ్డా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 సీజన్ 2025 మెగా వేలానికి రంగం సిద్ధమైంది. సౌదీ అరేబియాలో జెడ్డా నగరం వేదికగా ఆది, సోమ వారాల్లో ఈ మెగా వేలం పాట జరుగనుంది. ఇందులో 577 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దీని కోసం 204 స్లాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ వేలంలో రైట్ టు మ్యాచ్ పునరాగమనం జరిగింది. ఆయా ఫ్రాంచైజీలు తమ డ్రిమ్ స్కాడ్‌ల కోసం బరిలో దిగుతున్నాయి. ఈసారి రెండు కోట్ల రూపాయల రిజర్వ్ ధర కలిగిన క్రికెటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. భారత్‌కు చెందిన రిషబ్ పంత్, రాహుల్, అశ్విన్, ఇషాన్ కిషన్ తదితరులు బరిలో నిలిచారు. విదేశాలకు చెందిన స్టార్ క్రికెటర్లు కూడా వేలంలో పాల్గొంటున్నారు. ఈ మెగ వేలం కోసం బిసిసిఐ భారీ ఏర్పాట్లు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News