Tuesday, November 5, 2024

ఫిబ్రవరి 7,8 తేదీల్లో ఐపిఎల్ మెగా వేలం?

- Advertisement -
- Advertisement -

IPL mega auction on February 7,8?

 

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మెగా వేలం వచ్చే ఏడాది ఫిబ్రవరి ఏడు, ఎనిమిది తేదీల్లో నిర్వహించే అవకాశాలున్నట్టు తెలిసింది. వచ్చే ఐపిఎల్ సీజన్‌లో రెండు కొత్త ఫ్రాంచైజీలు ప్రవేశించనున్నాయి. ఇప్పటి వరకు 8 జట్లతోనే ఐపిఎల్ కొనసాగింది. అయితే వచ్చే ఏడాది నుంచి ఐపిఎల్ టోర్నీ పది జట్లతో జరుగనుంది. లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు కొత్త సీజన్‌లో తమ ప్రస్థానాన్ని ప్రారంభించనున్నాయి. ఈ జట్ల రాకతో ఐపిఎల్‌లో మెగా వేలం అనివార్యమైంది. ఫిబ్రవరిలో రెండు రోజుల పాటు ఈ మెగా వేలం ఉంటుందని బిసిసిఐకి చెందిన ఓ సీనియర్ అధికారి పిటిఐ వార్త సంస్థతో పేర్కొన్నట్టు తెలిసింది. వేలం పాట భారత్‌లోనే ఉంటుందని, బెంగళూరు వేదికగా ఇది కొనసాగే అవకాశాలున్నట్టు ఆ అధికారి వెల్లడించినట్టు పిటిఐ సంస్థ వివరించింది. మెగా వేలం పాటు కావడంతో రెండు రోజుల పాటు ఇది కొనసాగనుందని ఆ అధికారి పేర్కొన్నారు. ఇక మెగా వేలం పాట కోసం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమైనట్టు తెలిసింది.

అయితే దేశంలో కొవిడ్ పరిస్థితులు మాములుగా ఉంటేనే భారత్‌లో వేలం పాటు నిర్వహిస్తామని బిసిసిఐ అధికారి స్పష్టం చేశారు. ఒకవేళ దేశం కొవిడ్ తీవ్రత అధికంగా ఉంటే మాత్రం మెగా వేలం పాట వేదికగా యుఎఇకి మారుస్తామని ఆ అధికారి పేర్కొన్నట్టు తెలిసింది. అయితే దీనిపై బిసిసిఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పిటిఐ వార్త సంస్థ ఇచ్చి సమాచారం ప్రకారం ఫిబ్రవరి ఏడు, ఎనిమిది తేదీల్లో ఈ మెగా వేలం జరిగే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. కాగా వచ్చే ఏడాది మొత్తం పది జట్లు ఐపిఎల్‌లో తలపడనున్నాయి. ఈసారి కొత్తగా రెండు జట్ల చేరనున్నాయి. ఈ క్రమంలో పాత జట్లు రిటెయిన్ విధానంలో అట్టిపెట్టుకునే క్రికెటర్ల జాబితాను ఇప్పటికే భారత క్రికెట్ బోర్డుకు అందజేశాయి.

ఈసారి మెగా వేలం పాటలో డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టో, రషీద్ ఖాన్, కెఎల్.రాహుల్, శ్రేయస్ అయ్యర్, యజువేంద్ర చాహల్, జాసన్ రాయ్, కమిన్స్ వంటి స్టార్ క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక డేవిడ్ వార్నర్ మెగా వాలం పాటకు ప్రత్యేక ఆకర్షణగా మారాడు. అతన్ని తీసుకునేందుకు కొత్త జట్లతో పాటు పలు పాత ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశాలున్నాయి. అంతేగాక విండీస్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ తదితర దేశాలకు చెందిన క్రికెటర్లకు మెగా వేలం పాటలో మంచి ధర లభించే అవకాశాలున్నాయి. అంతేగాక దేశవాళి క్రికెట్‌లో మెరుగ్గా రాణిస్తున్న పలువురు భారత యువ క్రికెటర్లు కూడా ఐపిఎల్ మెగా వేలంలో జాక్‌పాట్ కొట్టినా ఆశ్చర్యం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News