Sunday, December 22, 2024

ఆ ఆటగాళ్లను టీమిండియాలోకి తీసుకోవాల్సిందే….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్ మ్యాచ్‌లో బ్యాటింగ్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను టి20 టీమిండియా జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. యశస్వి జైశ్వాల్, రూతురాజ్ గైక్వాడ్, రింకు సింగ్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, శివమ్ దూబే, సంజు శామ్సన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ లాంటి ఆటగాళ్లు ఐపిఎల్ పరుగుల వరద పారిస్తున్నారు. ఐపిఎల్ లో ఎక్కువ స్ట్రైక్ రేటుతో పరుగులు చేస్తున్న బ్యాట్స్ మెన్లలో టిమిండియా టి20 జట్టులోకి తీసుకోవల్సిందేనని క్రికెట్ పండితులు సూచిస్తున్నారు.

Also Read: వైస్ కెప్టెన్‌గా పుజారా?

భారత ఆటగాళ్లలో బ్యాటింగ్ విభాగంలో యశస్వి జైస్వాల్ 13 మ్యాచ్‌ల్లో 166 స్ట్రైక్‌రేట్‌తో 575 పరుగులు చేసి తొలి స్థానంలో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ 12 మ్యాచ్‌ల్లో 190 స్ట్రైక్‌రేట్‌తో 479 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. శుభ్‌మన్ గిల్ 12 మ్యాచ్‌ల్లో 140 స్ట్రైక్ రేటుతో 475 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 12 మ్యాచ్‌ల్లో 131 స్ట్రైక్ రేటుతో 438 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. రూతురాజ్ గైక్వాజ్ 13 మ్యాచ్‌ల్లో 146 స్ట్రైక్ రేటుతో 425 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. రింకూ సింగ్ 13 మ్యాచ్‌ల్లో 143 స్ట్రైక్ రేటుతో 407 పరుగులతో ఏడో స్థానంలో ఉన్నాడు. నితీస్ రాణా 13 మ్యాచ్‌ల్లో 143 స్ట్రైక్ రేటుతో 405 పరుగులతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. వెంకటేష్ అయ్యర్ 13 మ్యాచ్‌ల్లో 145 స్ట్రైక్‌రేటుతో 380 పరుగులతో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఇషాన్ కిషన్ (366), శివమ్ దూబే(363), సంజూశామ్సన్(360), శిఖర్ ధావన్(356), ప్రభ్‌సిమ్రాన్( 334) పరుగులు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News