Sunday, September 8, 2024

ఐపిఎల్ 2024 ప్లే ఆఫ్ కోసం తలపడనున్న ఆరు జట్లు

- Advertisement -
- Advertisement -

ఇంకా మూడు జట్లకే అవకాశం

హైదరాబాద్: ఐపిఎల్ 2024 లో ఒకే ఒక టీమ్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ప్లే ఆఫ్ కు క్వాలిఫై అయిపోయింది.  గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్…  మూడు టీమ్ లు ప్లే ఆఫ్ కు దూరం అయ్యాయి. కాగా ఐపిఎల్ ప్లే ఆఫ్ కు ఆరు టీమ్స్ బరిలో ఉన్నాయి. అవి రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఉన్నాయి.  వీటిలో మూడు టీమ్ లే ప్లే ఆఫ్ కు క్వాలిఫై అవుతాయి.

ఆర్సిబి మే 18న బెంగళూరులో చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడేందుకు ఒకే మ్యాచ్ ఉంది. సిఎస్కె కన్నా ఆర్సిబి నెట్ రన్ రేట్ బాగుంది. ఈ రెండు జట్లలో ప్లే ఆఫ్ కు క్వాలిఫై అయ్యేది ఏ జట్టో…

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ స్వంత మైదానంలో లక్నో సూపర్ జైంట్స్ తో ఆడాల్సిన ఒకే ఒక మ్యాచ్ ఉంది.

లక్నో సూపర్ జైంట్స్ ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఒకటి మే 14న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో, రెండోది మే 17న ముంబై ఇండియన్స్ తో తలపడాల్సి ఉంది.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి  ఉంది. ఒకటి గుజరాత్ టైటాన్స్, రెండోది పంజాబ్ కింగ్స్ జట్టుతో. ఈ రెండు మ్యాచ్ లు కూడా మే 16న, మే 19న హైదరాబాద్ లో జరుగనున్నాయి. హైదరాబాద్ జట్టుకు ఉన్న రన్ రేట్ ఓ అడ్వంటేజ్ అనే చెప్పాలి. రెండు మ్యాచ్ లలో ఒకటి గెలిచినా హైదరాబాద్ జట్టు ఐపిఎల్ కు క్వాలిఫై కాగలదు.

PK Vs SRH

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News