Tuesday, December 24, 2024

ఐపిఎల్ ప్లేఆఫ్ షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్16కు సంబంధించి ప్లేఆఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించారు. ప్లేఆఫ్ మ్యాచ్‌లకు చెన్నై, అహ్మదాబాద్‌లు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. క్వాలిఫయర్1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు చెన్నై వేదికగా జరుగనున్నాయి. తొలి క్వాలిఫయర్ మే 23న, ఎలిమినేటర్ మ్యాచ్ మే 24న చెన్నైలో జరుగుతాయి. ఇక క్వాలిఫయర్2తో పాటు ఐపిఎల్ ఫైనల్ సమరానికి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా నిలువనుంది. మే 26న క్వాలిఫయర్2, మే 28న ఫైనల్ పోరు జరుగనుంది. ఇక ఐపిఎల్ ఆరంభ వేడుకలకు కూడా అహ్మదాబాద్ ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలావుంటే డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌కు హోం గ్రౌండ్‌గా ఉండడంతో అహ్మదాబాద్‌ను ఫైనల్ పోరు కోసం ఎంపిక చేశారు. కాగా, ప్లేఆఫ్ మ్యాచ్‌ల కోసం ముంబై, బెంగళూరు, మొహాలీ, లక్నో తదితర నగరాలు పోటీ పడినా ఐపిఎల్ నిర్వాహకులు మాత్రం చెన్నై, అహ్మదాబాద్‌లవైపే మొగ్గు చూపారు. మరోవైపు ఐపిఎల్ లీగ్ దశ పోటీలు మే 21న ముగియనున్నాయి. ఒక రోజు విరామం తర్వాత ప్లేఆఫ్ మ్యాచ్‌లకు తెరలేస్తోంది. లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు జరుగనున్నాయి. నాకౌట్ దశలో మొత్తం నాలుగు జరుగుతాయి. ఇందులో క్వాలిఫయర్1, ఎలిమినేటర్, క్వాలిఫయర్2తో పాటు తుది సమరం ఉంది. మార్చి 31న ప్రారంభమైన ఐపిఎల్ సీజన్16లో శుక్రవారం నాటికి 29 మ్యాచ్‌లు ముగిసాయి. మరో 41 లీగ్ మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News