Sunday, December 22, 2024

అట్టహాసంగా ఐపిఎల్ ఆరంభ వేడుకలు

- Advertisement -
- Advertisement -

కనువిందు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 టోర్నమెంట్ సీజన్ 17కు శుక్రవారం తెరలేచింది. చెన్నైలోకి ఎంఎ చిదంబరం స్టేడియంలో ఆరంభ వేడుకలు కనుల పండవగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఫైర్ వర్క్ అభిమానులను కనువిందు చేశాయి. బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, టైగర్‌ష్రాఫ్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్, స్టార్ నేపథ్య గాయకుడు సోనూ నిగమ్ తదితరులు ఆరంభ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తదితరులు డ్యాన్స్‌తో దుమ్ములేపారు. వీరి డ్యాన్స్‌లకు చెపాక్ స్టేడియం హోరెత్తిపోయింది. సోనూ నిగమ్ వందేమాతరం ఆలాపనతో, రెహమాన్ మా తుజే సలాం పాటతో అభిమానులను కట్టి పడేశారు. మోహిత్ చౌహాన్ కూడా తన స్వర గానంతో ప్రేక్షకులను కనువిందు చేశాడు. బిసిసిఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జైషా, ఐపిఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్, ఆయా ఫ్రాంచైజీల కెప్టెన్లు ఆరంభోత్సవ కార్యక్రమాలను వీక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News