Thursday, January 23, 2025

IPL 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఐపిఎల్ సీజన్16లో భాగంగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, లక్నో సూపర్‌జెయింట్స్‌తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్ లో హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మ‌ర్‌క్రం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తొలి జ‌ట్టు ఎస్ఆర్‌హెచ్ కావ‌డం విశేషం. సొంత గడ్డపై జరిగిన తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం చవిచూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుక్రవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగే పోరు సవాల్‌గా మారింది.

ఇక కిందటి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ చేతిలో ఓటమి పాలైన లక్నోకు కూడా ఈ పోరు కీలకంగా తయారైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి తిరిగి విజయాల బాట పట్టాలని జట్టు తహతహలాడుతోంది. మరోవైపు కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ చేరికతో సన్‌రైజర్స్ కూడా బలంగా తయారైంది. కొంతకాలంగా బ్యాట్‌తోనే కాక కెప్టెన్సీలోనూ అదరగొడుతున్న మార్‌క్రమ్‌పై సన్‌రైజర్స్ భారీ ఆశలు పెట్టుకుంది. ఇటీవల సౌతాఫ్రికా వేదికగా జరిగిన టి20 టోర్నమెంట్‌లో మార్‌క్రమ్ సారథ్యంలోనే సన్‌రైజర్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో ఐపిఎల్ టోర్నీలోనూ మార్‌క్రమ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News