Monday, December 23, 2024

అబ్బో తగ్గేదేలే….!

- Advertisement -
- Advertisement -

విఐపి జోన్‌లో ఒక పోలీసు అధికారి సెటిల్మెంట్ దందా
పాత కేసులను తిరగతోడి మరీ బెదిరింపులు
కిందిస్థాయి సిబ్బందికి తలనొప్పిగా మారిన వైనం
ప్రతి చిన్న కేసును తానే చూస్తానని మొండిపట్టు
తనస్థాయిని మరిచి వసూళ్లు
తన డైరీలో క్లోజ్ ఐయితేనే కేసు క్లోజ్
ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న కొందరు అధికారులు

CI naked with women

మన తెలంగాణ/పంజాగుట్ట: అది నగరంలోనే సంపన్నులు, ప్రముఖులు నివసించే ప్రాంతం. అక్కడి పరిధిలోని ఏ పోలీసుస్టేషన్‌లో ఏ కేసు వచ్చినా ఏదో ప్రాధాన్యత ఉంటుంది. ఇక అక్కడ సివిల్ పంచాయితీలో తల దూరిస్తే లక్షల వర్షం కురుస్తుంది. ఏ చిన్న కేసును డీల్ చేసిన లక్షల రూపాయలు రాలుతాయి. ఇంకేముంది ఇదే ఆసరాగా ఈ రెండు పోలీస్టేషన్‌ల పరిధిలోని ఒక ఉన్నతాధికారి అంతా నా ఇష్టం అంటూ ఇష్టం వచ్చిన రీతిలో సెటిల్మెంట్ దందాలకు తెర తీశాడు. ఆయన పరిధిలోని రెండు స్టేషన్లల్లో ఏ కేసు వచ్చినా నేరుగా ఆయనే డీల్ చేయడం మొదలు పెట్టారు. అందుకోసం ఆయన ఒక డైరీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఈ రెండు పోలీస్ స్టేషన్లలో ఏ చిన్న కేసు క్లోజ్ చేయాలన్న ముందుగా ఆయన డైరీలో ముందుగా క్లోస్ కావాలి. ప్రతి కేసును ఎందుకు క్లోజ్ చేయాలి? ముందు కేసులో ఉన్నవాళ్ళని పిలిపించండి అంటూ తన కింది స్థాయి సిబ్బందికి హు కుం జారీ చేస్తాడు.

ఇక వాళ్ళని పిలిపించుకుని ఎంతో కొంత సెటిల్మెంట్ చేసుకోవడం ఆయనకు పరిపాటిగా మారింది. ఇక పాత కేసులను తోడి సెటిల్మెంట్ చేయడంలో ఆయన దిట్ట. మొన్నటికి మొన్న ఒక ఏడాది క్రితం ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక ఉద్యోగి 90 లక్షలు ఎత్తుకెళ్లారు అనే ఒక కేసులో ఆ కంపెనీ వాళ్ళని పిలిపించి మరి మరో ఫిర్యాదు ఇప్పించి కేసు సెటి ల్మెంట్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక ఎక్కడో జరి గిన ఒక 11కోట్ల వ్యవహా రాన్ని తన పరిధిలోని స్టేష న్‌లో కేసు నమోదు చేయి ంచి 9 కోట్లకు సెటిల్మెంట్ చే సినట్టు కూడా స మాచారం. పాత సివిల్ కేసు వివరాలు ఎస్‌ఐల నుంచి తెప్పించు కుని వాటిని తిరగ తోడడం, ఫిర్యాదులు ఇ ప్పించి మరి ఎదుటి వాళ్ళను భయపెట్టి సెటిల్మెంట్ చేయ డంలో ఈ ఉన్న తాధికారికి పెట్టింది పేరు.

ఇక్కడి స్టేషన్లలో సిఐ, ఎస్‌ఐలకు అందే ఫిర్యాదులు వెంటనే ఆయనకు తెలియజేయాల్సిందే. ఈ ఫిర్యాదుల్లో కాస్త కాసులు రాలే అవకాశం ఉన్న కేసులు ఆయనే స్వ యంగా డీల్ చేస్తారు. ఇక సివిల్ పంచాయితీలకు లెక్కే లేదు, ఎవరైనా స్థల వివాదం ఉంటే చాలు వెంటనే దూరిపోయి ఎదుటివాళ్లపై ఏదో ఒక ఫిర్యాదు చేయమని సలహాలు ఇచ్చి కేసు నమోదు చేస్తామని బెదిరించి రాజీ కుదర్చడంలో ఈ అధికారి దిట్ట. ఇటీవల ఓ కొండను ప్రైవేటు కంపెనీకి అప్పగించే వ్యవహారంలో ఈయనకు సదరు పెద్ద సంస్థ పెద్దముడుపులే అందిం చినట్టు ఆ యన కింది స్థాయి సిబ్బంది చెబుతున్నారు. నేరుగాగా ఫోన్ చేసి బెదిరించడంలో ఆయన దేశ ముదురు. ఏది ఏమైనా ఒక తెలంగాణ ప్రభుత్వం అవినీతికి అవకాశం లేకుండా ప్రజలకు సేవలు అందించేందుకు పోలీస్‌శాఖకు కోట్ల ని ధులు కేటాయించి, నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తుంటే, ఇలాంటి అధికారులు ప్రభు త్వానికి చెడ్డపేరు వచ్చేలా వ్యవహ రించడంపై పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News