Saturday, November 16, 2024

ఐపిఎస్ అధికారిగా

- Advertisement -
- Advertisement -

డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం 1997. నేటి సమాజంలో జరుగుతున్న సం ఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 26న గ్రాండ్‌గా విడుదల అవుతోంది. ఈ సినిమాలో హీరోగా నటిస్తూనే దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు డా.మోహన్.

ఈ సినిమా విడుదల సందర్భంగా హీరో, దర్శకుడు డా. మోహన్ మీడియా తో మాట్లాడుతూ “ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కథ. ఇందులో ఒక అమ్మాయిని రేప్ చేసిన తరువాత ఆమె పడే మానసిక వేదన, ముఖ్యంగా ఆమె తల్లి తాలూకు ఎమోషన్ ఎలా ఉంటుంది? అనేది ఈ చిత్రంలో చూపించాము. తక్కువ కులానికి చెందిన వాళ్ళను ఇంట్లోకి రానివ్వరు, గుడిలోకి రానివ్వరు. కానీ ఆమె లైంగిక వాంఛ తీర్చుకోవడానికి పనికి వస్తుందా? ఇక్కడ లేని అంటరానితనం అన్నది ఎందుకు అక్కడ లేదు? అన్న అంశంతో ఈ సిని మా ఉంటుంది. ఇందులో నేను ఐపిఎస్ పాసై అప్పుడే ఓ ఊరికి వెళ్లిన పోలీస్ అధికారిగా కనిపిస్తాను. ఊళ్లలో జరుగుతున్న ఈ సంఘటనలను ఆపేందుకు ప్రయత్నం చేసే పోలీస్ అధికారిని నేను. నా పాత్రలో అని రకాల షేడ్స్ ఉంటాయి”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News