Saturday, November 16, 2024

ఐపిఎస్ vs ఐఎఎస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర పోలీస్ అకాడెమీ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఐపిఎస్ అధికారి నవీన్ కుమార్‌ను సిసిఎస్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి భన్వర్ లాల్ ఫిర్యాదు మేరకు సిసిఎస్ పోలీసులు నవీన్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు.హైదరాబాద్ బేగంపేట్‌లో రిటైర్డ్ ఐఏఎస్ భన్వర్ లాల్ ఇంట్లో నవీన్‌కుమార్ గత కొన్ని రోజులుగా అద్దెకు ఉంటున్నారు. ఫోర్జరీ సంతకాలతో డాక్యుమెంట్లను సృష్టించి భన్వర్ లాల్ ఇల్లును కాజేసే ప్రయత్నం చేశాడు. దీంతో సిసిఎస్ పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నవీన్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. నవీన్ కుమార్‌తో పాటు మరో ఇద్దరు కూడ ఈ కేసులో ఉన్నారనే ప్రచారం సాగుతుంది.

అయితే హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు ఈ కేసులో నవీన్ కుమార్‌ను విచారించారు. నవీన్ కుమార్ గతంలో పని చేసిన జిల్లాల్లో కూడ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాతో పాటు తెలంగాణలోని వికారాబాద్, హైద్రాబాద్‌లలో కూడ నవీన్ కుమార్ ఎస్‌పిగా పనిచేశారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి భన్వర్‌లాల్‌కు ఐపిఎస్ అధికారి నవీన్‌కుమార్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై భన్వర్ లాల్ పోలీసు లను ఆశ్రయించారు. మరోవైపు ఐపిఎస్ నవీన్ కుమార్ అరెస్టును బిసి సంఘాలు ఖండించాయి. ఈ మేరకు 21 బిసి సంఘాలు నవీన్ అరెస్టును ఖండిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకొని నవీన్ కుమార్‌ని రిలీజ్ చేయాలని డిమాండ్ చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News