సిఎం రేవంత్ రెడ్డి నివాళి
హైదరాబాద్ : రాయదుర్గం మహాప్రస్థానంలో సీనియర్ ఐపిఎస్ అధికారి రాజీవ్త్రన్ అంత్యక్రియలు బుధవారం ముగిశాయి. అంతిమ సంస్కారాలకు సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహా ఐఎఎస్, ఐపిఎస్‌లతో పాటు పలువురు సైనిక అధికారులు హాజరై నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది. మంగళవారం ఉదయం కుమారుడితో కలిసి రాజీవ్త్రన్ జాగింగ్‌కు వెళ్లారు. కొద్దిసేపటికే ఆయన అస్వస్థతకు గురై విపరీతమైన గుండెనొప్పితో బాధపడగా ఆయన కుమారుడు సిపిఆర్ చేశారు.
అయినప్పటికీ నొప్పి ఇంకా ఎక్కువ అవ్వడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఎఐజి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మంగళవారం ఉదయం ఆయన మృతి చెందారు. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ డిజిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రాజీవ్త్రన్ సమర్థ అధికారిగా పేరొందారు. ఇటీవల మేడిగడ్డ ప్రాజెక్టుపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు సారథ్యం వహించారు.
గతంలో ఆయన కరీంనగర్ ఎస్‌పిగా, పైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా పని చేశారు. హైదరాబాద్ రీజియన్ ఐజిగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండిగా వివిధ హోదాల్లో పని చేశారు. ఆయన ఆకస్మిక మరణం రాష్ట్ర పోలీస్‌శాఖను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రాజీవ్ రతన్‌కు పోలీస్‌శాఖలో ముక్కుసూటి అధికారిగా పేరుంది. సుదీర్ఘ కాలం పోలీసు విభాగానికి ఆయన విశిష్ఠ సేవలు అందించారని సిఎం రేవంత్ కొనియాడారు.