Monday, December 23, 2024

“రా” అధిపతిగా రవిసిన్హా నియామకం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత నిఘా విభాగమైన రీసెర్చి అండ్ అనాలిసిస్ వింగ్ (ఆర్‌ఎడబ్లు) అధిపతిగా ఛత్తీస్‌గఢ్ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐపిఎస్ అధికారి రవిసిన్హా ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత రా చీఫ్‌గా ఉన్న సమంత్ గోయల్ పదవీకాలం ఈ నెల 30న ముగియడంతోఆయన స్థానంలో కొత్త ఛీఫ్‌గా రవిసిన్హా నియామకానికి కేంద్ర మంత్రుల కమిటీ ఆమోద ముద్ర వేసింది. ఇప్పటికే ఈ పదవిలో కొనసాగుతున్న సమంత్ కుమార్ గోయల్ రిటైర్మెంట్ తీసుకోనున్నారు. ఆయనకు ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వం పదవీకాలాన్ని పొడిగించింది.

విదేశాల్లో అత్యంత కీలకమైన నిఘా కార్యకలాపాలను “రా” నిర్వహిస్తోంది. రవిసిన్హా గత ఏడేళ్లుగా “రా ” ఆపరేషనల్ విభాగంలో అధిపతిగా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం క్యాబినెట్ సెక్రెటేరియట్ స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన ఢిల్లీ లోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆయన వ్యక్తిగత వివరాలు చాలా వరకు గోప్యంగా ఉన్నాయి. భారత ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రతిభావంతుడిగా ఆయనకు పేరుంది. ఆయన వివిధ విభాగాల్లో పనిచేశారు. పొరుగు దేశాల్లో జరిగే పరిణామాలపై మంచి పట్టుంది. ముఖ్యంగా ఆయన జమ్ము కశ్మీర్ ఈశాన్యభారత్, వామపక్ష తీవ్రవాదంపై పనిచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News