Sunday, December 22, 2024

కోర్టు ధిక్కరణ కేసులో తమిళనాడు ఐపిఎస్‌ కు జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

చెన్నై: క్రికెటర్ ఎంఎస్ ధోనీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసులో రిటైర్డ్ ఐపిఎస్ అధికారి సంపత్ కుమార్‌కు మద్రాసు హైకోర్టు జైలు శిక్ష విధించింది. 2013లో ఐఇపిఎల్ బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ రాకెట్‌ను వెలుగులోకి తీసుకురావడంలో సంపత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. జస్టిస్ ఎస్‌ఎస్ సుందర్, జస్టిస్ సుందర్ మోహన్‌తో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. అయితే సంపత్ కుమార్ అప్పీలు చేసుకోవడానికి వీలు కల్పిస్తూ ఈ ఉత్తర్వుల అమలును నెలరోజులపాటు నిలిపివేసింది. ధోని దాఖలు చేసిన ఒక పరువునష్టం పిటిషన్‌కు సంబంధించి సమర్పించిన అదనపు లిఖితపూర్వక వాంగ్మూలంలో ఇటీవలే ఐజిగా పదవీ విరమణ చేసిన సంపత్ కుమార్ సుప్రీంకోర్టు, మద్రాసు హైకోర్టులను కించపరిచే విధమైన వ్యాఖ్యలు చేశారని తన పిటిషన్‌లో ధోనీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News