Thursday, April 3, 2025

రఘునందన్ వ్యాఖ్యలపై ఐపిఎస్ అధికారుల సంఘం సీరియస్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: తెలంగాణ డిజిపి అంజన్ కుమార్‌పై బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్ వ్యాఖ్యలను ఐపిఎస్ అధికారుల సంఘం ఖండించింది. రఘునందన్ బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడంతో క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఐపిఎస్ అధికారుల సంఘం కోరింది. బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌లో ఉన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పరామర్శించడానికి వచ్చిన ఎంఎల్‌ఎ రఘునందన్ రావును పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు బిజెపి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News