Friday, November 22, 2024

ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం..

- Advertisement -
- Advertisement -

ఐపిఎస్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ స్వఛ్చంద పదవీ విరమణ విఆర్‌ఎస్ కోరుతూ సిఎస్‌కు ఈ మెయిల్
వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి
పూలే, అంబేద్కర్, కాన్షీరాంలు చూపిన మార్గంలో భావితరాలను కొత్త ప్రపంచంలోనికి నడిపించే చేస్తా
ట్విట్టర్‌లో ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, సీనియర్ ఐపిఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ స్వఛ్చంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేశారు. 26 సంవత్సరాలుగా ఐపిఎస్ అధికారిగా మాతృభూమికి సేవలు అందించానని, తనకు ఇంకా ఆరు సంవత్సరాల సర్వీసు మిగిలి ఉన్నప్పటికీ, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నానని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు తన స్వఛ్చంద పదవీ విరమణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ మెయిల్ ద్వారా తెలిపినట్లు ట్వీట్ చేశారు. పేద ప్రజలకు తోడుగా.. భావితరాలను ముందుకు నడిపించే దిశగా శేషజీవితాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తన పదవీ విరమణ తర్వాత తన స్పూర్తిప్రదాతలైన మహాత్మజ్యోతిరావు పూలే దంపతులు, బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, కాన్షీరాంలు చూపిన మార్గంలోనే నడిచి, పేదలకు పీడితులకు అండగా ఉండి, భావి తరాలను ఒక కొత్త ప్రపంచంలోనికి నడిపించే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. పదవిలో ఉన్నంత కాలం తనకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రవీణ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. పేదల బిడ్డలు జ్ఞానవంతులు కావాలని సంకల్పించి పూర్తి అంకిత భావంతో పని చేశానని చెప్పారు.

సంక్షేమ భవనంలో 9 సంవత్సరాల కాలం 9 నిమిషాలుగా గడిచిపోయిందని అన్నారు. పోలీసు అధికారిగా సేవలందించిన నేను మరింతగా పేద ప్రజలకు ఉపయోగపడాలని ఎస్.ఎర్.శంకరన్ మార్గంలో పేదలకు నాణ్యమైన చదువు అందాలని భావించానని పేర్కొన్నారు. తన మూలాలు సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్నాయి కాబట్టి, తన వంతుగా వాటికి సేవచేయాలని, పేదల బిడ్డలు జ్ఞానవంతులు కావాలని సంకల్పించి పూర్తి అంకితభావంతో పనిచేశారని తెలిపారు. ఒక మారుమూల గ్రామీణ ప్రాంతంలోని పేద మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, అరకొర వసతుల నడుమ, ఎంతో శ్రమించి అత్యంత ప్రతిష్టాత్మమైన ఇండియన్ పోలీసు సర్వీస్(ఐపిఎస్)లో చేరి, రెండున్నర దశాబ్దాల పాటు సర్వీసును అందించానని చెప్పారు. ఆ పదవీకాలం పూర్తవకుండానే ఈ విఆర్‌ఎస్ నిర్ణయం తీసుకోవాల్సి రావడం కొంత కలిగించినా, ఎట్టకేలకు ఎలాంటి పరిమితులు లేకుండా, తన మనసుకు ఇష్టమైన పనులను, తనకు నచ్చిన రీతిలో చేయబోతున్నాననే ఆనందం తమకు మరింత ఉత్సాహాన్ని, కొత్త శక్తిని ఇస్తోందని అన్నారు.

IPS RS Praveen Kumar Resigns his to post

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News