Sunday, December 22, 2024

ఎసిబి డైరెక్టర్‌గా తరుణ్‌జోషి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో భారీగా ఐపిఎస్‌ల బదిలీ జరిగింది. ఈ క్రమంలో 15 మంది ఐ పిఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో శాంతిభద్రతల అదనపు డిజిపిగా మహేశ్ భగవత్, రాచకొండ పో లీస్ కమిషనర్‌గా సుధీర్ బాబు, హోంగార్డు లు, ఆర్గనైజేషన్ అదనపు డిజిగా స్వాతి లక్రా, గ్రేహౌండ్స్ ఎడిజిగా స్టీఫెన్ రవీంద్ర, శాంతిభద్రతల అదనపు డిజిపిగా మహేష్ భగవత్, పోలీస్ పర్సనల్ అదనపు డిజిగా విజయ్ కుమార్, టిజిఎస్‌పి బెటాలియన్ల అదనపు డిజిగా సంజయ్ కుమార్ జైన్,

ఎసిబి డైరెక్టర్‌గా తరుణ్ జోషి, మల్టీ జోన్1ఐజిగా ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, రైల్వే, రోడ్ సేఫ్టీ ఐజీగా కె.రమేష్ నాయుడు, మెదక్ ఎస్‌పిగా ఉదయ్ కుమార్ రెడ్డి, వనపర్తి ఎస్‌పిగా ఆర్.గిరిధర్, హైదరాబాద్ తూర్పు మండలం డిసిపిగా బి.బాలస్వామి, హైదరాబాద్ పశ్చి మ మండలం డిసిపిగా జి.చంద్రమోహన్, సిఎఆర్ హెడ్ క్వార్టర్స్ డిసిపిగా రక్షితమూర్తిలను ప్రభుత్వం నియమించింది. సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ జితేందర్‌ను ప్రభుత్వం రాష్ట్ర డిజిపిగా నియమించిన సంగతి విదితమే. ఈ ఉత్తర్వులు వెలువడిన నిమిషాల్లో నే పోలీసు శాఖలో మరోసారి భారీగా బదిలీలు జరగడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News